Saturday, 4 March 2017

5 మార్చి 2017

కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు చేజారి పోతాయి. భాగస్వామిక చర్చలలో మీ అభిప్రాయాలకు ఆమోదం లభిస్తుంది. క్యాటరింగ్ పనివారకు, హోటల్, తినుబండారాల వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.


Saturday, 25 February 2017

26 ఫిబ్రవరి 2017

సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. కొబ్బరి, కూరలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది. గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పాత్ర మిత్రుల కలయిక ద్వారా మీకెంతో సంతృప్తినిస్తుంది.

Thursday, 23 February 2017

24 ఫిబ్రవరి 2017

కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులతో ఏకీభావం కుదరదు. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఎల్.ఐ.సి., పోస్టల్, ఇళ్ల స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వైద్యులు ఒత్తిడి, మానసికాందోళనలకు గురవుతారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు మిశ్రమ ఫలితం.

Wednesday, 22 February 2017

23 ఫిబ్రవరి 2017

ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సామాన్యం. వృత్తుల వారికి కలసిరాగలదు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.

Tuesday, 21 February 2017

22 ఫిబ్రవరి 2017

కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. ఏజెంట్లు, బ్రోకర్లకు అనుకూలత. ప్రియతముల గురించి అప్రియమైన వార్తలు అందుతాయి. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశించినంత లాభదాయకంగా సాగవు.

Sunday, 19 February 2017

20 ఫిబ్రవరి 2017

ధనవ్యయంలో మితంగా వ్యవహరించండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పెద్దవారిలో మందకొడితనం అధికం అవుతుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Saturday, 18 February 2017

19 ఫిబ్రవరి 2017

ప్రయాణాలు, నూతన ప్రదేశ సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్నివిధాలా సహకారం అందిస్తారు. స్త్రీలకు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలనే తాపత్రయం అధికమవుతుంది.