Saturday, 25 February 2017

26 ఫిబ్రవరి 2017

సన్నిహితులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. కొబ్బరి, కూరలు, పండ్లు, పూల వ్యాపారస్తులకు సంతృప్తికరంగా ఉంటుంది. గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పాత్ర మిత్రుల కలయిక ద్వారా మీకెంతో సంతృప్తినిస్తుంది.

Thursday, 23 February 2017

24 ఫిబ్రవరి 2017

కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులతో ఏకీభావం కుదరదు. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఎల్.ఐ.సి., పోస్టల్, ఇళ్ల స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్ల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వైద్యులు ఒత్తిడి, మానసికాందోళనలకు గురవుతారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు మిశ్రమ ఫలితం.

Wednesday, 22 February 2017

23 ఫిబ్రవరి 2017

ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు సామాన్యం. వృత్తుల వారికి కలసిరాగలదు. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత వహించండి. ప్రముఖుల కలయిక వాయిదా పడుతుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.

Tuesday, 21 February 2017

22 ఫిబ్రవరి 2017

కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. ఏజెంట్లు, బ్రోకర్లకు అనుకూలత. ప్రియతముల గురించి అప్రియమైన వార్తలు అందుతాయి. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశించినంత లాభదాయకంగా సాగవు.

Sunday, 19 February 2017

20 ఫిబ్రవరి 2017

ధనవ్యయంలో మితంగా వ్యవహరించండి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పెద్దవారిలో మందకొడితనం అధికం అవుతుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు క్రీడలు, ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

Saturday, 18 February 2017

19 ఫిబ్రవరి 2017

ప్రయాణాలు, నూతన ప్రదేశ సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాలు అనుకూలిస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్నివిధాలా సహకారం అందిస్తారు. స్త్రీలకు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలనే తాపత్రయం అధికమవుతుంది.

Friday, 17 February 2017

18 ఫిబ్రవరి 2017

స్త్రీలకు ప్రతి విషయంలోనూ ఓర్పు, లౌక్యం అవసరం. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలం అవుతాయి. క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. దైవ కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. రుణ విముక్తులు కావటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు లాభదాయకం.

Thursday, 16 February 2017

17 ఫిబ్రవరి 2017

స్పెక్యులేషన్ రంగాలవారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం క్షేమదాయకం. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. ప్రముఖులతో చర్చలు వాయిదా పడతాయి.

Wednesday, 15 February 2017

16 ఫిబ్రవరి 2017

దైవ, శుభకార్యాల్లో స్త్రీలు పలువురిని ఆకట్టుకుంటారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. చిరు వ్యాపారులకు కలసి రాగలదు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థులకు కొత్త విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సలహా పాటిస్తారు.

Tuesday, 14 February 2017

15 ఫిబ్రవరి 2017

స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. భవిష్యత్ గురించి పథకాలు వేసి జయం పొందుతారు. అనారోగ్య సూచనలు అధికం అవుతాయి.

Monday, 13 February 2017

14 ఫిబ్రవరి 2017

చిట్‌ఫండ్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత అవసరం. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడి దిశగా మీ ఆలోచనలు సాగిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం.

Sunday, 12 February 2017

13 ఫిబ్రవరి 2017

ఆత్మీయులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. విహారయాత్రలు చేస్తారు. మీ సంతానం ఉన్నత విద్యల గురించి ఒక నిర్ణయానికి వస్తారు.

Saturday, 11 February 2017

12 ఫిబ్రవరి 2017

చేతివృత్తులు, చిరు వ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. రాబడికి మించిన ఖర్చులెదురవుతాయి. వస్త్ర, వెండి, బంగారు వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలుంటాయి. బిల్లులు చెల్లిస్తారు. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.

Friday, 10 February 2017

11 ఫిబ్రవరి 2017

భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. స్త్రీలు కలుపుగోలుతనంగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ప్రైవేటు సంస్థలలోనివారు సహకార సంఘాలలోనివారు పనిలో ఏకాగ్రత వహించలేక పోవటంతో అధికారులవద్ద మాటపడాల్సి వస్తుంది. పాత మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. విదేశీ యత్నాలు ఫలిస్తాయి.

Thursday, 9 February 2017

10 ఫిబ్రవరి 2017

ప్రముఖులను కలుసుకుంటారు. ఊహించని వారి నుంచి అవమానాలు, అంతరాయాలు ఎదుర్కోవలసి వస్తుంది. పొట్ట, తలకి సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. సంతానం విషయంలో ప్రోత్సాహం కానవస్తుంది. నిరుద్యోగులకు మధ్యవర్తులపట్ల అప్రమత్తత అవసరం. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడటం మంచిది.

Wednesday, 8 February 2017

9 ఫిబ్రవరి 2017

బంధువుల రాకతో గృహంలో ఖర్చులు అధికం అవుతాయి. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మీ దైనందిన కార్యక్రమాల్లో మార్పులుండవు. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు.

Tuesday, 7 February 2017

8 ఫిబ్రవరి 2017

ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఇతరత్రా ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా పురోభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ అవసరాలు రాబడికి మించిన ఖర్చులవల్ల ఆటుపోట్లు తప్పవు. విద్యార్థినులకు తోటివారి కారణంగా ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ అవసరాలు, బలహీనతలు గమనించి ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు యత్నిస్తారు.

Monday, 6 February 2017

7 ఫిబ్రవరి 2017

పారిశ్రామిక రంగంలోని వారికి సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. స్త్రీలు విలువైన వస్త్రాలు, ఆభరణాలు అమర్చుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలతోపాటు, పనిలో ఒత్తిడి, చికాకులు అధికం అవుతాయి. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగి జయం పొందండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, జాప్యం పెరుగుతుంది. ప్రయాణాలలో సంతృప్తి కానవస్తుంది.

Sunday, 5 February 2017

6 ఫిబ్రవరి 2017

ప్రైవేటు సంస్థలలోనివారు, సహకార సంఘాలలోనివారు పనిలో ఏకాగ్రత వహించలేక పోవటంవల్ల అధికారులతో మాటపడాల్సి వస్తుంది. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలసివచ్చే కాలం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. రుణాలు తీరుస్తారు. కాంట్రాక్టర్లకు ఎప్పటినుంచో ఆగి ఉన్న పనులు పునఃప్రారంభం అవుతాయి.

Saturday, 4 February 2017

5 ఫిబ్రవరి 2017

చిట్స్, ఫైనాన్స్, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు ఓర్పు, నేర్పు చాలా అవసరం. మీ లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరమని గమనించండి. నూనె, కంది, మినుము, ఎండుమిర్చి స్టాకిస్టులకు పురోభివృద్ధి. రావలసిన ధనం సకాలంలో అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. నిరుద్యోగులకు ఒక చిన్న అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది.

Friday, 3 February 2017

4 ఫిబ్రవరి 2017

వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శుభదాయకం. ఓర్పు, నేర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినగానీ నెమ్మదిగా సమసిపోతాయి. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి.

Thursday, 2 February 2017

3 ఫిబ్రవరి 2017

ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. విద్యార్థులు ఒత్తిడి, మానసికాందోళనలకు గురవుతారు. మీ సంతానం కోసం శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలు ఖచ్చితంగా వెల్లడించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.

Wednesday, 1 February 2017

2 ఫిబ్రవరి 2017

లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనుకోకుండా కొన్ని పనులు పూర్తి చేస్తారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదరదు. ఉమ్మడి నిధుల నిర్వహణలో మాటపడాల్సి వస్తుంది. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. ధనం నిలుపుకోవటం కష్టం.